చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూత
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ (90) కన్నుమూశారు
Priestchilkur


హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ (90) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం చిలుకూరులోని నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన తనయుడు, ఆలయ ప్రస్తుత ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. హైదరాబాద్లోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సౌందర్ రాజన్ ఎంతో కాలం క్రమశిక్షణతో, సేవానిరతితో నిర్వహించారు. భక్తులతో మమేకమై స్వామి వారి ప్రసాదాన్ని, సేవా విధానాన్ని ఎంతో ప్రశాంతంగా వివరించేవారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande