
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
భారత మహిళల క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు హోబర్ట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతీక రావల్ (52), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (54) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే స్మృతి మంధాన (31)తో కలిసి ప్రతీక రావల్ తొలి వికెట్కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా, చివర్లో హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపింది. మిడిల్ ఆర్డర్ కాశ్వీ గౌతమ్ (25), రిచా ఘోష్ (22) కీలక పరుగులు జోడించడంతో భారత్ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఆసీస్ బౌలర్లలో గార్డనర్, అన్నాబెల్ మరియు అలానా కింగ్ తలో రెండు వికెట్లతో రాణించారు. మూడు వన్డేల సిరీస్ లో ఆసీస్ జట్టు మొదటి వన్డే చేజిక్కించుకోగా.. ఇప్పుడు సిరీస్ ను సమం చేయాలంటే భారత బౌలర్లు ఈ 252 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే సిరీస్ కొట్టాలంటే ఈ మ్యాచ్ ఇరుజట్లకూ కీలకమైనదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు