మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కాం.. ట్రయల్ కోర్టు క్లీన్ చీట్ను సవాలు చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్
న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మందికి ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే కీలక మలుపు తిరిగింది. ట్రయల్ కోర్టు నిర్ణయం పై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మ
Liquor


న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.)

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మందికి

ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే కీలక మలుపు తిరిగింది. ట్రయల్ కోర్టు నిర్ణయం పై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో న్యాయ పోరాటం మళ్లి ప్రారంభం అయింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన 'క్లీన్ చీట్' ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ అప్పీల్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో లభించిన కీలక సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, నిందితులను విడిచిపెట్టడం వల్ల దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది.

ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. ఉదయం కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో, సీబీఐ హైకోర్టుకు వెళ్లడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. ఈ అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పు కేజీవాల్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ హైకోర్టు ఈ పిటిషనన్ను విచారణకు స్వీకరించి, స్టే విధిస్తే కేజీవాల్ సహా ఇతర నేతలకు వచ్చిన ఉపశమనం తాత్కాలికమే అవుతుంది. ఈ పరిణామంతో ఈ కేసుపై న్యాయ పోరాటం మళ్ళీ మొదటికి చేరినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande