
నారాయణపేట, 27 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో సీఎం కప్లో స్థానిక పట్టణంలో మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం మక్తల్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో సన్మానించారు. ఈవెంట్లలో బహుళ పాల్గొని 3వ స్థానాన్ని సాధించారు. షాట్ పుట్ లో నర్మదా, జావెల్హోలు హారిక, వాలీబాల్ లో పవిత్ర కాంస్య పతకాలు సాధించారు. ఈ పథకాలతోనే సరిపెట్టుకో రాదని రాష్ట్రంలో సాధించిన పథకాన్ని అనుభవంగా తీసుకుని జాతీయ అంతర్జాతీయంగా పోటీలో పాల్గొనే విధంగా ఎదగాలని అన్నారు. మీ ప్రాంతంలోని యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి వారిని క్రీడల్లో పాల్గొనే లాగా చూడాలని మక్తల్ పట్టణం క్రీడాకారులకు నిలయం అన్న పేరు మారు మోగాలని అందుకు తన సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి క్రీడాకారులతో అన్నారు. ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం క్రీడాలో తర్ఫీదు ఇవ్వాలని డీఎస్ఓ వెంకటేష్ కు ఆదేశించారు, ఈ కార్యక్రమం కోచ్లలు: నర్మద, హారిక, అశ్విని, విష్ణు వర్ధన్, రాఘవేంద్ర, జగదీష్ భరత్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు