
జైసల్మేర్:, 27 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఇవాళ లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో విహరించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమె సోర్టీ నిర్వహించారు. భారత్, పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము విహరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహరించారు.
స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుందని, జైసల్మేర్ జిల్లాలో విహరిస్తున్నానని, మన విరోచిత సైనికులకు హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నానని ముర్ము ఆ హెలికాప్టర్ కాక్పిట్ నుంచి సందేశం వినిపించారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్, జై భారత్ అని ఆమె అన్నారు. పోక్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఇక్కడే ఇవాళ సాయంత్రం వాయు శక్తి పేరుతో విన్యాసాలు నిర్వహించనున్నారు.
ఇవాల్టి సోర్టీతో యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించి తొలి భారత రాష్ట్రపతిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో ఆమె అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్లో ఆమె సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ప్లేన్లో ఎగిరారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎల్సీహెచ్ ప్రచండ హెలికాప్టర్ను నిర్మించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, స్టీల్త్ ఫీచర్స్, నైట్ అటాక్ కెపాసిటీ, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు