డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి : ఎస్పీ మహేష్ బి.గీతే
రాజన్న సిరిసిల్ల, 27 ఫిబ్రవరి (హి.స.) రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంట
Sp


రాజన్న సిరిసిల్ల, 27 ఫిబ్రవరి (హి.స.) రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన

లక్ష్యంగా చేపట్టిన అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈవైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై శిబిరాన్ని ప్రారంభించి, అవసరమైన డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రతని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ప్రతి వాహనాదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్పష్టమైన చూపు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు.

వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే సందర్భల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అన్ని మండల కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande