

ఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి ఢిల్లీలోని JNU వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. యూజీసీ నిబంధనల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్ లో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర గర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఏకంగా 25 మంది పోలీసులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.
దీంతో జెఎన్ యూఎస్ యూ ప్రెసిడెంట్ అదితి మిశ్రా తో పాటు 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ వారిని విడుదల చేసే వరకు పోరాటం ఆగేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హై టెన్షన్ నెలపొంది. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV