లొంగిపోతానన్న కమాండర్ను హత్య చేసిన మావోయిస్టు నాయకుడు
భువనేశ్వర్, 27 ఫిబ్రవరి (హి.స.)పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడిన మావోయిస్టు కమాండర్ను అతడి నాయకుడు హత్య చేసినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. కంధమాల్ జిల్లా ఎస్పీ హరీష్ తెలిపిన ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని సుక్మాకు చెందిన అన్వేష్ అలియాస్ రేణు మావోయి
లొంగిపోతానన్న కమాండర్ను హత్య చేసిన మావోయిస్టు నాయకుడు


భువనేశ్వర్, 27 ఫిబ్రవరి (హి.స.)పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడిన మావోయిస్టు కమాండర్ను అతడి నాయకుడు హత్య చేసినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. కంధమాల్ జిల్లా ఎస్పీ హరీష్ తెలిపిన ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని సుక్మాకు చెందిన అన్వేష్ అలియాస్ రేణు మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడిగా, కలహండి-కంధమాల్-బౌధ్-నయాగఢ్ (కేకేబీఎన్) డివిజన్ ప్లటూన్ కమాండర్గా ఉండేవాడు. అతడిపై రూ.22 లక్షల రివార్డు కూడా ఉంది. కొద్ది నెలల క్రితం తన వద్దనున్న క్యాడర్తో కలిసి ఒడిశా పోలీసుల ముందు లొంగిపోవడానికి అన్వేష్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇది అతడి నాయకుడు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు సుక్రు, అనుచరులు సిలా, జగేష్లకు నచ్చలేదు. దీంతో గత నెల 29న అన్వేష్ను వారందరూ కలిసి హత్య చేసినట్లు ఎస్పీ హరీష్ తెలిపారు. దరింగాబాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారీ రక్షిత అటవీ ప్రాంతంలో ఖననం చేసి ఉన్న అతడి మృతదేహాన్ని బుధవారం బయటకు తీశామని ఎస్పీ వెల్లడించారు. పోలీసుల ముందు లొంగిపోయే విషయంలో మావోయిస్టుల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందని యాంటీ నక్సల్ ఆపరేషన్లలో అనుభవం ఉన్న ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande