
తిరుమల, 27 ఫిబ్రవరి (హి.స.)
ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాలకట్ల తెప్పోత్సవాలు కొనసాగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు టోకెన్లు లేని ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఇక ముందస్తుగా టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల వ్యవధిలో దర్శనం అవుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,035 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రూ.4.48 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV