ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణ నదిపై వంతెన నిర్మాణ పనులు 10 రోజుల్లో.
అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.) పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు-ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణా నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు గత మూడు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొన్ని డిజైన్లలో మార్పులకు ఆమోదం, గుత్తేదారు బిల్లుల
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణ నదిపై వంతెన నిర్మాణ పనులు 10 రోజుల్లో.


అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.)

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు-ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణా నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు గత మూడు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొన్ని డిజైన్లలో మార్పులకు ఆమోదం, గుత్తేదారు బిల్లుల కోసం ఎదురుచూపులతో ఈ పరిస్థితి ఏర్పడింది. సరైన సమయంలో పనులు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ంతెన నిర్మాణంతో పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఈ జిల్లాల మధ్య ప్రయాణ దూరం 60 కి.మీ వరకు తగ్గుతుంది. మాదిపాడు ఆవలి ఒడ్డున ఉన్న సిమెంట్ ఉత్పత్తులు రవాణా సులభతరం అవుతుంది. పుణ్యక్షేత్రాలు మాదిపాడు సత్తెమ్మ దేవాలయం, పులిచింతల ప్రాజెక్టు, అమరావతి, వేదాద్రి, ముక్త్యాల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, కోటిలింగాల క్షేత్రం సందర్శనకు దూరం తగ్గుతుంది. పడవ ప్రయాణాలు వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. రవాణా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది.

కొన్ని డిజైన్ల మార్పులతో ఆర్అండ్బీ ఉన్నతాధికారుల వద్దకు ప్రతిపాదనలు వెళ్లాయని వాటి ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని రూ.5 కోట్ల పనులకు రూ.3 కోట్లు బిల్లు మంజూరైందని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు. పది రోజుల్లో నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande