నందిగామలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ముందడుగు
నందిగామ, 28 ఫిబ్రవరి (హి.స.), అమరావతి - నందిగామ, : నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడింది. రూ.3.75 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2023 సెప్టెంబరులో జరిగిన పబ్
నందిగామలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ముందడుగు


నందిగామ, 28 ఫిబ్రవరి (హి.స.), అమరావతి - నందిగామ, : నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడింది. రూ.3.75 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2023 సెప్టెంబరులో జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ సమావేశంలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తొలిసారి కేంద్రం పచ్చజెండా ఊపింది. తర్వాత ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేయడంతో.. ఎంపీ కేశినేని శివనాథ్ 2024 ఆగస్టు నుంచి పలుమార్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రాలను అందించారు. కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులనూ సంప్రదించారు. ఎట్టకేలకు 2025 అక్టోబరులో నందిగామకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్రం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం రూ.40 లక్షలతో రహదారి నిర్మాణం:నందిగామలోని రాఘవపురంలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని.. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ స్థలానికి సరైన మార్గం లేకపోతే.. రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో రహదారి ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వం తాజాగా జీవో నంబరు 145 జారీ చేస్తూ.. ఆ ఐదు ఎకరాలను అధికారికంగా కేటాయించింది. ఈసందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ, ఎమ్మెల్యే సౌమ్య ధన్యవాదాలు తెలిపారు.

నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా.. స్థానికంగా విద్యారంగానికి ఇదో మంచి అవకాశమని సౌమ్య తెలిపారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యాలయాన్ని మంజూరు చేయించారన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలతో కాలం వెళ్లదీశారని.. తాము వచ్చాక.. కార్యరూపంలోకి తెచ్చామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande