
గుంటూరు 28 ఫిబ్రవరి (హి.స.)
, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి ఒక వ్యక్తి చొరబడి.. కార్ను ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఈ నేపథ్యంలో భద్రతా విభాగం నుంచి ఐదుగురిని వెనక్కి పంపింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి. పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ