రియాద్పై క్షిపణి దాడిలో యూపీ వ్యక్తి దుర్మరణం
సీతాపుర్:ఢిల్లీ, 22మార్చి (హి.స.) సౌదీ అరేబియా రాజధాని రియాద్పై జరిగిన క్షిపణి దాడిలో ఉత్తర్ప్రదేశ్లోని మెహ్ముదాబాద్కు చెందిన రవి గోపాల్(26) మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబరు నుంచి రియాద్లోని ఓ ప్లాస్టిక్ ఫ్యా
BrahMos Missile


సీతాపుర్:ఢిల్లీ, 22మార్చి (హి.స.) సౌదీ అరేబియా రాజధాని రియాద్పై జరిగిన క్షిపణి దాడిలో ఉత్తర్ప్రదేశ్లోని మెహ్ముదాబాద్కు చెందిన రవి గోపాల్(26) మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబరు నుంచి రియాద్లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో రవి పనిచేస్తున్నాడు. ఈనెల 18న రాత్రి 9:30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. 20 నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్ డిస్కనెక్ట్ అయింది. కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ క్రమంలో అతడి స్నేహితుడైన రామ్ నివాస్.. రవి మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తర్వాతి రోజు ఫోన్ చేసి చెప్పాడు. క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించాడు. రవికి భార్యతోపాటు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రవి మృతదేహాన్ని స్వదేశానికి చేర్చేందుకు సహాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande