చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ
ఢిల్లీ, 23మార్చి (హి.స.) పండుగ సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో కీలక ప్రకటన,చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్
Modi


ఢిల్లీ, 23మార్చి (హి.స.) పండుగ సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో కీలక ప్రకటన,చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారతీయులు క్షేమంగా దేశానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఇరాన్ నుంచే సుమారు 1,000 మంది భారతీయులు తిరిగి వచ్చారని తెలిపారు. అలాగే గల్ఫ్ దేశాలలో, కోటిమందికి పైగా నివసిస్తున్నారు. వారి కోసం 24/7 కంట్రోల్ రూమ్స్, హెల్ప్లైన్స్ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. ఈ సంక్షోభ సమయంలో విదేశాలలో ఉన్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత నిచ్చినట్టు ప్రధాని స్పష్టం చేశారు

గృహ అవసరాల ఎల్పీజీకే ప్రాధాన్యత

గృహ అవసరాల ఎల్పీజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, దేశీయంగా వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచామని మోదీ స్పష్టం చేశారు. హార్మోజ్ జల సంధిలో ఇరుక్కున్న భారత్ నౌకలను సురక్షితంగా తీసుకు వచ్చామని మోదీ తెలిపారు. 41 దేశాల నుంచి చమురు, గ్యాస్, ఫర్టిలైజర్స్ తెప్పిస్తున్నామనీ. సురక్షిత నౌకా మార్గాలపై దృష్టిసారించామన్నారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ఇంధనం రిజర్వుగా ఉందని ఈ సందర్బంగా మోదీ తెలిపారు.

పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా గ్యాస్, క్రూడాయిల్ సరఫరా ఇబ్బందిగా మారింది. అయితే ఇంధన సమస్యలను అధిగమించేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తోందని మోదీ వెల్లడించారు. సాధ్యమైన ప్రతి చోటి నుంచీ చమురు, గ్యాస్ సరఫరాలను సేకరించ డానికి భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. బ్లాక్మార్కెట్ను అరికట్టేలా కఠిన చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande