గగన్యాన్ మిషన్.. జీరో గ్రావిటీ శిక్షణలో వ్యోమగాములు
ఢిల్లీ, 23మార్చి (హి.స.) భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ (Gaganyaan) అంతరిక్ష ప్రాజెక్టు కోసం ఇస్రో (ISRO) అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే అంతరిక్ష యాత్రకు వెళ్లనున్న వ్యోమగాములను సిద్ధం చేస్తోంది. ఈ యాత్రకు ఎంపికైన వాయుసేనక
Shubhamshu Shukla and team


ఢిల్లీ, 23మార్చి (హి.స.) భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ (Gaganyaan) అంతరిక్ష ప్రాజెక్టు కోసం ఇస్రో (ISRO) అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే అంతరిక్ష యాత్రకు వెళ్లనున్న వ్యోమగాములను సిద్ధం చేస్తోంది. ఈ యాత్రకు ఎంపికైన వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా భార రహిత స్థితిలో శిక్షణ తీసుకుంటున్నారు. తమ శిక్షణకు సంబంధించిన దృశ్యాలను శుక్లా (Shubhanshu Shukla) సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి.

వ్యోమగామిగా శిక్షణ తీసుకోవడం కేవలం ఒక కార్యక్రమం కాదని.. విస్తృతమైన, కఠినమైన, ఆశ్చర్యాలతో కూడిన సంపూర్ణ విజ్ఞానమని శుక్లా పేర్కొన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ఊహించని సంఘటన ఎదురవుతుందని తెలిపారు. అంతరిక్షంలోని పరిస్థితులjకు అనుగుణంగా మార్పులు చేసిన ఎయిర్బస్ ఏ 330, ఐఎల్-76 విమానాలలో వ్యోమగాములు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వాటిని వామిట్ కామెట్స్ అని కూడా అంటారు. గురుత్వాకర్షణ లేని భార రహిత వాతావరణ పరిస్థితుల్లో కదలడం, పనిచేయడం వంటి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ శిక్షణ వారికి సహాయపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande