పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
ఢిల్లీ, 22మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేస
Gold


ఢిల్లీ, 22మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.

కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.

సాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది. పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్ను తగ్గిస్తున్నాయి.

ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande