మోదీయే అతిపెద్ద చొరబాటుదారు
కోల్కతా: /ఢిల్లీ, 22మార్చి (హి.స.) బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాదిమంది చొరబాటు దారులు పశ్చిమబెంగాల్లో తిష్టవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. శనివారం కోల్కతా
mamta banerjee


కోల్కతా: /ఢిల్లీ, 22మార్చి (హి.స.) బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాదిమంది చొరబాటు దారులు పశ్చిమబెంగాల్లో తిష్టవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. శనివారం కోల్కతాలోని రెడ్రోడ్లో జరిగిన రంజాన్ వేడుకల్లో మమత పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, బహుళ సామాజిక వైవిధ్యం పరిరక్షణకు జరుగుతున్న పోరాటమే ఈ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును మోదీ జీ, బీజేపీ లాక్కునేందుకు చేసే యత్నాలను అడ్డుకుంటా.

చివరిదాకా పోరాడతా. కోల్కతా నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా ప్రతిచోట కేంద్రం అసంబద్ధ నిర్ణయాలను సవాల్చేస్తా. మీరు(మోదీ) ముస్లిం దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాలకులతో కరచాలనం చేస్తారు. స్నేహబంధంపై ప్రసంగాలిస్తారు. తీరా భారత్కు వచ్చాక హిందూ–ముస్లిం అంటూ విడగొడతారు. ఓటర్ల పేర్లను ‘సర్’ జాబితా నుంచి అన్యాయంగా తొలగించారు. పైగా వాళ్లపై చొరబాటుదారులు అనే ముద్రవేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande