జిన్నా పాఠం తొలగించండి.. జమ్మూలో ఆందోళన
జమ్మూ /ఢిల్లీ, 22మార్చి (హి.స.) వర్సిటీ ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ విశ్వవిద్యాలయంల
జిన్నా పాఠం తొలగించండి.. జమ్మూలో ఆందోళన


జమ్మూ /ఢిల్లీ, 22మార్చి (హి.స.) వర్సిటీ ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-2028 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసన సిలబస్లో 'ఆధునిక భారత రాజకీయ ఆలోచన' అనే శీర్షిక కింద, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. దేశ విభజనలో పాత్ర పోషించి, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వీరే. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తోంది'. అని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

పాఠ్యప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా, మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande