వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన
జమ్మూ 22 మార్చి (హి.స.)ప్రస్తుతం కొనసాగుతున్న చైత్ర నవరాత్రుల వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి ఆలయం భక్తజన సంద్రమైంది. రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా శనివారం (మార్చి 21) సాయంత్రం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిల
Katra. Vaishnov


జమ్మూ 22 మార్చి (హి.స.)ప్రస్తుతం కొనసాగుతున్న చైత్ర నవరాత్రుల వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి ఆలయం భక్తజన సంద్రమైంది. రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా శనివారం (మార్చి 21) సాయంత్రం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాలపై కొలువైన ఈ దివ్య క్షేత్రానికి శనివారం ఒక్కరోజే సుమారు 39,000 మంది భక్తులు తరలివచ్చారు. చైత్ర నవరాత్రులు (మార్చి 19 - మార్చి 27) ప్రారంభమైన మూడవ రోజే ఈ స్థాయిలో రద్దీ పెరగడంతో, క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande