గ్యాస్ సిలిండర్ల కొరత గాడ్ ఏజెన్సీ వద్దకు పరుగులు
, నరసరావుపేట, 23 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడటంతో జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద కొద్ది రోజులుగా వినియోగదారులు బారులు తీరుతున్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసిన 2
గ్యాస్ సిలిండర్ల కొరత  గాడ్ ఏజెన్సీ వద్దకు పరుగులు


, నరసరావుపేట, 23 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడటంతో జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద కొద్ది రోజులుగా వినియోగదారులు బారులు తీరుతున్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసిన 24గంటల్లో సిబ్బంది డెలివరీ చేసేవారు. ప్రస్తుతం వారంపైగా సమయం తీసుకుంటున్నారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి ఓటీపీ వస్తోంది. గతంలో మాదిరి సిలిండర్లతో వాహనాలు గ్రామాలకు రావటం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకే పరుగులు తీస్తున్నారు. రొంపిచర్లలో ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు.

సిలిండర్ల కోసం బారులు తీరారు. నిర్వాహకులు సరఫరా ఉన్న వరకు సిలిండర్లు పంపిణీ చేశారు. మిగిలిన వారిని తర్వాత రోజు రావాలని వెనక్కి పంపుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం చిరు వ్యాపారులపై పడింది. టిఫిన్, పానీపూరీ బండ్లు, టీ దుకాణాలు, ఫాస్ట్పుడ్ సెంటర్లు గ్యాస్ లేక మూసేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో కొన్ని చోట్ల భోజన, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కట్టెలతో వంట చేస్తున్నారు. రానున్న రోజుల్లో గృహావసరాల గ్యాస్ వినియోగదారులకూ ఇబ్బందులు తప్పేటట్లు లేవు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో గ్యాస్ ఇబ్బందులను జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి సరిపడా స్టాకు సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande