జొమాటో బాటలోనే స్విగ్గీ.. ప్లాట్ ఫారమ్ ఫీజు పెంపు
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ డెలివరీ సంస్థలు జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) తమ ప్లాట్ఫారమ్ ఫీజును పెంచాయి. జొమాటో తన చార్జీలను సవరించిన కొద్ది రోజుల్లోనే స్విగ్గీ కూడా ప్లాట్ ఫారమ్ ధరలను
Swiggy


హైదరాబాద్, 24 మార్చి (హి.స.) ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు

షాక్ ఇస్తూ ప్రముఖ డెలివరీ సంస్థలు జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) తమ ప్లాట్ఫారమ్ ఫీజును పెంచాయి. జొమాటో తన చార్జీలను సవరించిన కొద్ది రోజుల్లోనే స్విగ్గీ కూడా ప్లాట్ ఫారమ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి ఆర్డర్పై కస్టమర్లు చెల్లించే అదనపు భారం ఇప్పుడు మరింత పెరగనుంది.

స్విగ్గీ తన ప్లాట్ఫారమ్ ఫీజును రూ.14.99 నుంచి ఏకంగా రూ.17.58 (జీఎస్టీతో కలిపి) కి పెంచింది. ఇది దాదాపు 17 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ప్లాట్ఫారమ్ నిర్వహణ, మెరుగైన సేవలను అందించేందుకే ఈ ఫీజును సవరించినట్లు సంస్థ తన యాప్లో కస్టమర్లకు సమాచారం ఇస్తోంది. మరోవైపు జొమాటో కూడా ఒక్కో ఆర్డర్పై జీఎస్టీ కాకుండా రూ.12.50 గా ఉన్న ప్లాట్ఫారమ్ ఫీజును రూ.14.90 కి పెంచింది. అంటే ఒక్కో ఆర్డర్పై సుమారు రూ.2.40 అదనంగా భారం పడనుంది.

పన్నులతో కలిపి చూస్తే ఈ రెండు పోటీ సంస్థలు ఇప్పుడు దాదాపు ఒకే విధమైన చార్జీలను వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ప్లాట్ఫారమ్ ఫీజు అనేది చిన్న మొత్తంగా అనిపించినప్పటికీ, నెలకు పదుల సంఖ్యలో ఆర్డర్లు చేసే కస్టమర్ల బడ్జెట్పై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. యాప్ సాంకేతికతను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులు, కార్యకలాపాల వ్యయం పెరగడమే ఈ పెంపునకు కారణమని కంపెనీలు సమర్థించుకుంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande