'గ్రీన్ఫీల్డ్' రోడ్లతో మారనున్న తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రం తన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త రహదారి వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ''తెలంగాణ రైజింగ్- విజన్ 2047''లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్
Greenfield


హైదరాబాద్, 24 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రం తన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త రహదారి వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. 'తెలంగాణ రైజింగ్- విజన్ 2047'లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సరికొత్త చోదక శక్తులుగా మారనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, రాబోయే 360 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)లను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఈ రహదారులు భవిష్యత్తు రవాణా తీర్చడమే అవసరాలను కాకుండా పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇవి సాధారణ రహదారులకు భిన్నంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్లు నగరంలోని రద్దీ ప్రాంతాలను తాకకుండా, వేగవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తాయి. రాష్ట్రంలోని కోర్ అర్బన్, పెరి-అర్బన్, రూరల్ అగ్ని ప్రాంతాలను అనుసంధానిస్తాయి. ప్రభుత్వం వీటిని హబ్ అండ్ స్పోక్ మోడల్లో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా (హబ్) ఉంటే ఈ 10 రోడ్లు వివిధ దిశల్లో వెళ్లే స్పోక్స్ పనిచేస్తాయి.

రేడియల్ రోడ్ నంబర్ 1ను 41.5 కి.మీ. పొడవైన సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్లోని రావిర్యాల్ జంక్షన్ను రీజినల్ రింగ్ రోడ్ను ఆమనల్ వద్ద ఈ రోడ్డు కలుపుతుంది. ఇది భారత్ ఫ్యూచర్ సిటీ గుండా వెళ్తుంది. ప్రస్తుతం ఈ రేడియల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అలాగే 81 కి. మీ. మేర విస్తరించి ఉండే రేడియల్ రోడ్ నంబర్- 2 బుద్వేల్ వద్ద ఓఆర్ఆర్

నుంచి ప్రారంభమవుతుంది. ఆర్ఆర్ఆర్ మీదుగా కొడంగల్ నియోజకవర్గంలోని నాచారం వద్ద ఎన్హెచ్-167ఎన్తో కలుస్తుంది. దీనివల్ల పరిశ్రమలకు రవాణా వ్యయం తగ్గనుంది.

అలాగే లగచర్ల ఎడ్యుకేషన్ హబ్కు ప్రయాణం సులువవుతుంది. ఇప్పటికే మొదటి రెండు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అలాగే ఈ మొత్తం 10 రహదారుల వెంబడి ప్రభుత్వం 10 అత్యాధునికమైన నెట్-జీరో టౌన్షిప్లను నిర్మించనుంది. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, పరిశ్రమలకు సమీపంలోనే నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయడం ద్వారా నడుస్తూ పనికి వెళ్లే (వాక్-టు-వర్క్) సంస్కృతిని ప్రోత్సహిస్తాయి.

1. రావిర్యాల్ (ఓఆర్ఆర్) - ఆమన్జల్ (ఆర్ఆర్ఆర్)

2. బుద్వేల్ (ఓఆర్ఆర్) - నాచారం (ఆర్ఆర్ఆర్)

3. కొండకల్ (ఓఆర్ఆర్) - సంగారెడ్డి (ఆర్ఆర్ఆర్)

4. సుల్తాన్పూర్ (ఓఆర్ఆర్) - నర్సాపూర్ (ఆర్ఆర్ఆర్)

5. మేడ్చల్ (ఓఆర్ఆర్) - తూప్రాన్ (ఆర్ఆర్ఆర్)

6. కీసర (ఓఆర్ఆర్) - గజ్వేల్/ప్రజ్ఞాపూర్ (ఆర్ఆర్ఆర్)

7. ఘటకేసర్ (ఓఆర్ఆర్) - భువనగిరి (ఆర్ఆర్ఆర్)

8. గౌరెల్లి (ఓఆర్ఆర్) - చౌటుప్పల్ (ఆర్ఆర్ఆర్)

9. బొంగులూరు (ఓఆర్ఆర్) - ఇబ్రహీంపట్నం/మల్లేపల్లి (໙໙໙໓)

10. శంషాబాద్ (ఓఆర్ఆర్) - షాద్నగర్ (ఆర్ఆర్ఆర్)

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande