హైదరాబాద్ నగరానికి 915 ఎలక్ట్రిక్ బస్సులు.. ఇక వాతావరణ కాలుష్యానికి చెక్!
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) భాగ్యనగర వాసులకు మెరుగైన, పర్యావరణహిత రవాణా సౌకర్యాలను అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం ఈ-డ్రైవ్ (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద హై
Electric bus


హైదరాబాద్, 24 మార్చి (హి.స.) భాగ్యనగర వాసులకు మెరుగైన, పర్యావరణహిత రవాణా సౌకర్యాలను అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం ఈ-డ్రైవ్ (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద హైదరాబాద్లో 915 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా, నిర్వహణ కోసం ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ మొబిలిటీ కన్సార్టియంకు లెటర్ ఆఫ్ అవార్డు (LOA) లభించింది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) నేతృత్వంలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 915 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో నగరంలోని ఇరుకైన రోడ్లు, కాలనీల అవసరాల కోసం తొమ్మిది మీటర్ల పొడవున్న 100 మినీ బస్సులు, ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 12 మీటర్ల పొడవున్న 815 స్టాండర్డ్ ఫ్లోర్ నాన్-ఏసీ బస్సులు నగర వాసులకు సేవలు అందించనున్నాయి.

ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ కావడంతో కాలుష ఉద్గారాలు ఉండవు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా వీటిని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. ఇప్పటికే రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ-బస్సుల సరఫరాకు ఆర్డర్లు పొందిన ఈకేఏ మొబిలిటీ... ఇప్పుడు హైదరాబాద్లోనూ తన సేవలను విస్తరించడం విశేషం. పీఎం ఈ-డ్రైవ్ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్ను స్మార్ట్, క్లీన్ సిటీగా మార్చడంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని ఈకేఏ మొబిలిటీ బిజినెస్ హెడ్ రోహిత్ శ్రీవాస్తవ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande