రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. 100 నియోజకవర్గాల్లో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'!
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) లను ఏర్పాటు చేయాలని సంకల
Public schools


హైదరాబాద్, 24 మార్చి (హి.స.)

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు మంచి స్పందన వచ్చింది. అంతర్జాతీయ హంగులతో ఏర్పాటైన ఈ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను చదివిస్తున్నారు. దీంతో ఆరుట్ల పబ్లిక్ స్కూల్ తరహాలోనే కొత్తగా వంద నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పాఠశాలలను నిర్ణయించింది.

తెలంగాణ పబ్లిక్ స్కూల్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. నర్సరీలో చేరితే పదోతరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఒకే గ్రామంలో వేర్వేరు చోట బడులు, జూనియర్ కాలేజీలుంటే ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తారు. ఇతర గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి ఒక టీచర్ ను నియమిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకూ సమానంగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబులు అందుబాటులో ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్లో ఎలాంటి సౌకర్యాలుంటాయో అవన్నీ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఉండనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రతి పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు ఒకే చోట విద్య అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా డిజిటల్ క్లాస్ట్రూమ్లు, ల్యాబ్లు, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్ బస్సు నెట్వరన్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను గజ్వేల్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande