విజయవాడ నగరంలో. తక్కువ ధరకు బంగారం పేరిట మోసం
విజయవాడ, 23 మార్చి (హి.స.)విజయవాడ నగరంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ ధరకు బంగారం)విక్రయిస్తామనే ఆశ చూపి మోసం చేయాలనుకున్న ముఠాను విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధానంగా మాజీ హోంగార్డ్ పోలీసు వేషంలో వచ్చి
విజయవాడ నగరంలో. తక్కువ ధరకు బంగారం పేరిట మోసం


విజయవాడ, 23 మార్చి (హి.స.)విజయవాడ నగరంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ ధరకు బంగారం)విక్రయిస్తామనే ఆశ చూపి మోసం చేయాలనుకున్న ముఠాను విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధానంగా మాజీ హోంగార్డ్ పోలీసు వేషంలో వచ్చి దబాయించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారుl

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి, విజయవాడకు చెందిన వర్మ అనే వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఆశ చూపించాడు. బయట మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే ఇస్తానని నమ్మించి, ప్రసాద్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు రప్పించాడు.

ప్రసాద్, వర్మలు బంగారం డీల్ కోసం కలుసుకున్న సమయంలో, పక్కా ప్లాన్ ప్రకారం ఓ ముఠా ఎంట్రీ ఇచ్చింది. ఈ ముఠాలో హరికృష్ణ అనే మాజీ హోంగార్డ్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) యూనిఫాంలో వచ్చాడు. అతడితో పాటు కిరణ్, సురేశ్ అనే వ్యక్తులు కానిస్టేబుల్స్ లాగా వచ్చారు.

బంగారం కొంటున్నారనే నెపంతో ప్రసాద్ను బెదిరించి, అతని వద్ద ఉన్న నగదును కాజేయాలనేది వీరి ప్లాన్. పోలీసులుగా నమ్మించి భయభ్రాంతులకు గురిచేయాలని వారు భావించారు.

ఈ వ్యవహారంలో బాధితుడు ప్రసాద్ ముందే అప్రమత్తమయ్యాడు. వర్మ ప్రవర్తనపై అనుమానం రావడంతో, అతను ముందే విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాడు. నిందితులు ప్రసాద్ను ట్రాప్ చేసే సమయంలో, అప్పటికే అక్కడ మాటు వేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. మాజీ హోంగార్డ్ హరికృష్ణతో పాటు వర్మ, కిరణ్, సురేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న నకిలీ ఐడెంటిటీ కార్డులు, పోలీసు యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఎప్పుడూ గుర్తింపు పొందిన నగల దుకాణాల్లోనే కొనాలని సూచించారు. తెలియని వ్యక్తులతో రహస్యంగా నగదు లావాదేవీలు జరపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande