గ్యాస్ సిలిండర్లు దొరకక హోటల్.నిర్వాహకుల ఇబ్బందులు
అమరావతి, 23 మార్చి (హి.స.) : గ్యాస్ సిలిండర్లు దొరకక, మరో పక్క ధరలు పెరిగి హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖర్చు తగ్గించేందుకు కొందరు డీజిల్తో మండే పొయ్యిలను తయారుచేస్తే...మరింత ఖర్చు తగ్గించే విధంగా వేలేరుపాడు మండలం అల్లూరినగర్కు చెంది
గ్యాస్  సిలిండర్లు దొరకక హోటల్.నిర్వాహకుల ఇబ్బందులు


అమరావతి, 23 మార్చి (హి.స.) : గ్యాస్ సిలిండర్లు దొరకక, మరో పక్క ధరలు పెరిగి హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖర్చు తగ్గించేందుకు కొందరు డీజిల్తో మండే పొయ్యిలను తయారుచేస్తే...మరింత ఖర్చు తగ్గించే విధంగా వేలేరుపాడు మండలం అల్లూరినగర్కు చెందిన వెల్డింగ్ వర్కర్ కాళ్ల కరుణామయుడు వాహనాల నుంచి తీసేసిన ఇంజిన్ ఆయిల్తో పనిచేసే స్టవ్ తయారుచేశారు. చిన్నపాటి విద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ వైపు.. మరో వైపు ఇంజిన్ ఆయిల్ చుక్కలు పొయ్యి దగ్గరకు పంపి.. అక్కడ రెండు బొగ్గులు పెట్టి వెలిగించడం ద్వారా మంట వచ్చేలా దీనిని రూపొందించారు.

అవసరాన్ని బట్టి మంట హెచ్చుతగ్గులు చేసుకునే వీలుంది. ఒక లీటరు వృథా ఇంజిన్ ఆయిల్తో రెండు గంటలపాటు పొయ్యి మండుతుందని కరుణామయుడు తెలిపారు. దీనికి సుమారు రూ.7 వేలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట హోటళ్ల నిర్వాహకులు సైతం తయారీకి ఆర్డర్లు ఇవ్వడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande