శ్రీరామ నవమి శోభయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు.. సిపి సజ్జనార్
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) శ్రీ రామ నవమి శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు సోమవారం సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్ లో శ్రీ రామ నవమి ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమ
Sajjanar


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)

శ్రీ రామ నవమి శోభాయాత్రకు

పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు సోమవారం సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్ లో శ్రీ రామ నవమి ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలు శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే శ్రీ రామ నవమి శోభాయాత్ర కు సర్వం సిద్ధం చేస్తామని తెలిపారు. 16 సంవత్సరాలుగా ఈ శోభ యాత్ర కొనసాగుతుందని అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా శోభ యాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ యాత్రలో దాదాపు 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటారన్నారు. శోభాయాత్ర సాగే మార్గాలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాని కొనసాగిస్తామన్నారు. అంతే కాకుండా డ్రోన్ల ద్వారా శోభా యాత్ర తీరును పర్యవేక్షిస్తామని, పిక్ పాకేటింగ్, చైన్ స్నాచింగ్, వంటి వాటిని అరికట్టేందుకు క్రైమ్ టీం లతో పాటు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్రౌపది గార్డెన్ నుండి మొదలై హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే ఈ శోభాయాత్రలో ఉన్న సమస్యలపై శ్రీ రామ నవమి ఉత్సవ సమితి కమిటీ సభ్యులు సీపీ కి వివరించారు. అన్నింటినీ పరిగణనలోకి అన్ని శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని సీపీ తెలిపారు. అనంతరం శోభాయాత్ర కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక వాహనంలో రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు,సెక్రటరీ గోవింద్ రాటి,జీ హెచ్ ఎం సి కమిషనర్ ఆర్ వి కర్ణన్, గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అడిషనల్ సీపీ ఇక్బాల్, డీసీపీ శిల్పవల్లి,చంద్రమోహన్,ట్రాఫిక్ లు ఏసిపి ధనలక్ష్మి,విద్యుత్ శాఖ, ఆర్ టీ సీ, హెచ్ ఎం డబ్ల్యు ఎస్, హెల్త్ క్యాంప్స్, ట్రాఫిక్ పోలీసు అధికారులు, మాజీ కార్పొరేటర్లు,శశికళ కృష్ణ, సింగ్,పరమేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande