5 రోజుల దాడులు ఉండవు… ట్రంప్ కీలక ప్రకటన
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్లోని విద్యుత్
ట్రంప్


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)

ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను తాత్కాలికంగా 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం యుద్ధ పరిస్థితుల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగా యుద్ధాన్ని కొనసాగించాలా లేదా పూర్తిగా నిలిపివేయాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande