
అమరావతి, 23 మార్చి (హి.స.):ఈరోజు(సోమవారం) ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల నారా లోకేశ్ ) సైతం వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సమాజానికి ) విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప నాయకుడంటూ ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
'ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నాను. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోంది. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ