
కర్నూలు 24 మార్చి (హి.స.), సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసగాళ్లు రూ.లక్షల్లో డబ్బు తీసుకుని మోసగించారంటూ పలువురు బాధితులు ఎస్పీ విక్రాంత్పాటిల్కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో నకిలీ నియామక పత్రం ఇచ్చి కర్నూలుకు చెందిన శరత్గౌడ్, అనంతపురం వాసి హంపిరాజు రూ.4.80 లక్షలు తీసుకుని మోసగించారని కల్లూరు మండలానికి చెందిన ఫణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్నేహితుల ద్వారా పరిచయమైన అనంతపురానికి చెందిన దేశ్ముఖ్ లతీఫ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.10 లక్షలు తీసుకొని మోసగించాడని కర్నూలు మండలం పసుపులకు చెందిన సాయి ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ