
అత్తిలి, 24 మార్చి (హి.స.) : అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన ఇంగువ వెంకన్నబాబుకు అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన కల్యాణం నాగలక్ష్మి(26)ని ఇచ్చి 31 మార్చి, 2018న వివాహం చేశారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. మూడేళ్లుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె భర్త, అత్త వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ నెల 22న రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికిగురై సోమవారం తెల్లవారు జామున నాగలక్ష్మి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ