వైకాపా నాయకులు తమ భూమిని.కబ్జా చేసి విక్రయించారని ఫిర్యాదు
ఆదోని, 24 మార్చి (హి.స.): వైకాపా నాయకులు తమ భూమిని కబ్జా చేసి, ఇతరులకు విక్రయించారని గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దివ్యాంగులైన తండ్రీకుమారులు లక్ష్మన్న, మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం
వైకాపా నాయకులు తమ భూమిని.కబ్జా చేసి విక్రయించారని ఫిర్యాదు


ఆదోని, 24 మార్చి (హి.స.): వైకాపా నాయకులు తమ భూమిని కబ్జా చేసి, ఇతరులకు విక్రయించారని గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దివ్యాంగులైన తండ్రీకుమారులు లక్ష్మన్న, మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. అల్వాల గ్రామంలో సర్వె నంబర్ 105లో 4.2 ఎకరాలు భూమి ఉంది. ప్రభుత్వం నుంచి పట్టా కూడా పొందారు. సాగులో ఉన్న 40 సెంట్ల భూమిని వైకాపా నాయకులు కబ్జా చేసి, ఇతరులకు విక్రయించారని వాపోయారు. ప్రశ్నిస్తే.. కులం పేరుతో దూషించి, బెదిరింపులకు పాల్పడుతూ.. దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కలెక్టర్, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగినా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తామిద్దరం దివ్యాంగులమని, చేయి, కాలు సరిగా లేదన్నారు. అక్రమంగా అమ్మిన 40 సెంట్ల భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande