కర్నూలు లో ఒకే చోట రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.చోటుచేసుకున్నాయి
కర్నూలు:, 25 మార్చి (హి.స.) కర్నూలు( లో ఒకే చోట రెండు ఘోర రోడ్డుప్రమాదాల చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల) వద్ద ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు క
కర్నూలు లో ఒకే చోట  రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.చోటుచేసుకున్నాయి


కర్నూలు:, 25 మార్చి (హి.స.) కర్నూలు( లో ఒకే చోట రెండు ఘోర రోడ్డుప్రమాదాల చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల) వద్ద ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే, అదే సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో మరో ఇద్దరు స్పాట్లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మంచి చేయడానికి వెళ్తే ఏకంగా ప్రాణాలు పోయాయంటూ స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. మరోవైపు బాధిత కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంబసభ్యుడి మరణవార్త విన్న వారి రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande