రేపే రాములోరి కళ్యాణం.. ముస్తాబైన దేవాలయాలు
భూపాలపల్లి, 26 మార్చి (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు దేవాలయాలు రామ నవమి వేడుకలకు ముస్తాబైనాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరపటానికి భక్తులు సిద్ధమయ్యారు. గురువారం రోజు గ్రామాల్లో దేవాలయం వద్ద పచ్చని పందిళ్లు వేసి దే
Sri Rama Navami


భూపాలపల్లి, 26 మార్చి (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు దేవాలయాలు రామ నవమి వేడుకలకు ముస్తాబైనాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరపటానికి భక్తులు సిద్ధమయ్యారు. గురువారం రోజు గ్రామాల్లో దేవాలయం వద్ద పచ్చని పందిళ్లు వేసి దేవాలయాలను పూలతో అలంకరించారు. భూపాలపల్లి జిల్లాలో గతంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహదేవపూర్ మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి గ్రామంలో భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

గ్రామాల్లో శ్రీరామ కళ్యాణం జరిపితే శుభ పరంగా ఉంటుందని గ్రామాల్లోని భక్తులందరు వేసుకుని ఉత్సవాలు చందాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. జిల్లాలో గురువారం శుక్రవారం గ్రామంలో సందడిగా ఉంటుంది. ప్రతి హనుమాన్ దేవాలయం వద్ద రెండు రోజులు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. శుక్రవారం రోజు ఉదయమే స్వామి వారి విగ్రహాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం ఎదుర్కోళ్ళ కార్యక్రమం చేసి సీతారాముల కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేస్తారు. శుక్రవారం రోజు జిల్లా వ్యాప్తంగా వైన్ షాప్ బందు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో ఉత్సవాలు జరిగే కార్యక్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande