రైతాంగానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండ.. భూపాలపల్లి ఎమ్మెల్యే
భూపాలపల్లి, 31 మార్చి (హి.స.) మార్క్ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శాయంపేటలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి
MLA


భూపాలపల్లి, 31 మార్చి (హి.స.) మార్క్ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శాయంపేటలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలోని 8 మండలాలకు 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 30 లక్షల టన్నుల మక్కాలో కేవలం 8 లక్షల టన్నులకే కొనుగోలు అనుమతి ఇవ్వడం రైతులకు అన్యాయం అని విమర్శించారు. మిగతా 22 లక్షల టన్నుల కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు నష్టం కలగకుండా క్వింటాల్కు రూ.1000 వరకు భారం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతును రాజు చేస్తానని సన్న వడ్లు దొడ్డువడ్లు వేయొద్దని చెప్పి సన్న వడ్లను వేయాలని సన్న వడ్లు కూడా దొడ్డు వడ్ల ధరలకే కొనుగోలు చేసిందని విమర్శించారు. వరేస్తే ఊరే అని గత ప్రభుత్వం రైతులను అయోమయం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారీ అప్పులు ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణమాఫీ, పంటల కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. మక్క కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande