గ్రేటర్ హైదరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోతలు.. జనం అవస్థలు
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) గ్రేటర్ హైదరాబాద్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్
Electricity


హైదరాబాద్, 31 మార్చి (హి.స.)

గ్రేటర్ హైదరాబాద్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు 35 డిగ్రీల సెల్పియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ వాతావరణ ప్రతినిత్యం శాఖ అధికారులు హెచ్చరిస్తుండగా ప్రజలు ఇండ్లలో కూడా ఉండలేని విధంగా కరెంట్ కోతలు ఉంటున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడం, గంటల పాటు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, గాలులతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా మొదలైంది. సుమారు రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఒక్క నిమిషం విద్యుత్ కోతలు విధించినా అధికారులపై చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్చరికలు జారీ చేశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు పని చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande