అనుమతులు లేవు.. భద్రత అసలే లేదు: సూర్యాపేటలో అక్రమ కట్టడాలు!
సూర్యాపేట, 31 మార్చి (హి.స.) సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్త
Suryapet


సూర్యాపేట, 31 మార్చి (హి.స.)

సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం బొమ్మ రోడ్డు వద్ద నుంచి కొత్త బస్టాండ్ వెళ్లే మార్గమధ్యంలో రెసిడెన్షియల్ బిల్డింగ్ అనుమతులు తీసుకుని కమర్షియల్ బిల్డింగ్ నిర్మించారు. సెట్బ్యాక్ లేకుండానే భవన నిర్మాణం చేయడంతో ఆ భవనానికి అనుమతులు సంబంధిత శాఖలు ఎలా ఇచ్చారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్కు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడం, రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడం జిల్లాలో సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా జిల్లా కేంద్రంలో నిర్మాణాలు జరగడం వల్ల కొన్ని భవనాల్లో ఇప్పటికే పగుళ్లు కనిపిస్తున్నాయని సమాచారం. సెట్బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేయడం వల్ల గాలి, వెలుతురు సమస్యలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ బిల్డింగ్ యజమానులు పట్టించుకోవడం లేదు. ఈ బిల్డింగ్లో సరైన అనుమతులు లేకుండానే లిఫ్ట్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా లిఫ్ట్లను నడపడం తీవ్ర ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande