కాంగ్రెస్, బీజేపీల అనుబంధం బయటపడ్డది.. మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ (CR Patil) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్
హరీష్ రావు


హైదరాబాద్, 31 మార్చి (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram

Project) పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ (CR Patil) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపై పాటిల్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తేడా లేదని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ (BRS) పార్టీపై బురదజల్లే అంశంలో కాంగ్రెస్, బీజేపీల అనుబంధం బయటపడిందని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అంటున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

కాళేశ్వరంతో పంటల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని.. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక సర్వేలు (Economic Surveys) కూడా చెప్పాయని చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోతే.. మల్లన్న సాగర్లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమతో రావాలని, కాళేశ్వరం జలాలతో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, పండుతున్న పొలాలను చూపిస్తామని సవాల్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande