ఆర్థిక సంవత్సరం చివరి రోజు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిట..!
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయడంతో పనిగం
Registrations


హైదరాబాద్, 31 మార్చి (హి.స.)

ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి.

ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయడంతో పనిగంటలు పెంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తున్నారు.

ప్రభుత్వానికి ఆదాయం వస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల టార్గెట్ను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పెంచారు. అన్ని స్లాట్లు బుక్ అయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా కొనసాగింది. వారి ఆధ్వర్యంలోనే ఎక్కువగా సబ్ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.

ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు రోజులు టార్గెట్ పెంచింది. టార్గెట్ కు అనుగుణంగా ఎక్కువ స్లాట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కెపాసిటీలకు అనుగుణంగా ఈ టార్గెట్లను పెంచారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత శనివారం నుంచి ఉదయం 9.30ల నుంచి రాత్రి 8.30ల వరకు పనిగంటలు పెంచారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ మూడు రోజుల పాటు రెగ్యులర్ గా జరిగే రిజిస్ట్రేషన్ల కంటే 60 శాతం అదనంగా స్లాట్లను కేటాయించారు. స్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయేంతవరకు కార్యాలయాలను తెరిచే ఉంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

నేడు చివరి రోజు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లను రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లను చేశారు. స్లాట్ బుక్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వడంతో ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో అన్ని కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. స్తిరాస్థి వ్యాపారులు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా చేసుకున్నారు. ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో వెంచర్లు, అపార్ట్ మెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా ఈ రెండు రోజులు భారీగానే జరుగుతున్నాయి. ఇవే కాకుండా మార్ట్ గేజ్ లు ఇతర రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande