పల్లెలకు ప్రాకిన గంజాయి సంస్కృతి.. అరికట్టాలంటూ ప్రజల డిమాండ్
సూర్యాపేట, 31 మార్చి (హి.స.) గంజాయి వాడకం పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకిందనీ, యువతనే లక్ష్యంగా చేసుకున్న విక్రయదారులు నయా ట్రెండు అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు ఉండడం వలన చివ్వ
Ganja


సూర్యాపేట, 31 మార్చి (హి.స.)

గంజాయి వాడకం పట్టణాల నుంచి

పల్లెలకు కూడా పాకిందనీ, యువతనే లక్ష్యంగా చేసుకున్న విక్రయదారులు నయా ట్రెండు అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు ఉండడం వలన చివ్వెంల మండలంలోని వివిధ నిర్మానుష ప్రాంతాలను గంజాయి విక్రయాలు అడ్డాలుగా మార్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా గుట్టుగా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గంజాయి దందా జోరుగా సాగుతున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి, ఈ అక్రమ వ్యాపారం పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గంజాయి దందా ఇటు పోలీసులకు, అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుమానాలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఈ దందాకు కళ్లెం వేయాల్సిన అధికారుల నిఘా వైఫల్యంతోనే గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ దందాపై నిఘా వేసి కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికే పలు రకాల మత్తు పానీయాలకు అలవాటు పడిన యువత మరో చెడు మార్గాన్ని కూడా ఎంచుకొని తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని, గంజాయి నింపిన సిగరెట్లు తాగుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనీ, మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా యువత పట్టించుకోవడం లేదని వారిపై తల్లిదండ్రుల ఆజమాయిషి కూడా లేకపోవడంతో మరింత చెడు మార్గాల్లో పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి, గంజాయి వ్యాపారంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande