
ముంబై, 31 మార్చి (హి.స.)భారత స్టాక్ మార్కెట్లకు ఈరోజు (మార్చి 31)సెలవు. మహావీర్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ఇవాళ పనిచేయవు. నేటితో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ, ముందే నిర్ణయించిన సెలవుల జాబితా ప్రకారం మార్కెట్లు మూసిఉంటాయి
ఇవాళ ఈక్విటీ, డెరివేటివ్స్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) విభాగాల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిపివేస్తారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం సెషన్ (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మూసి ఉంటుంది. అయితే, సాయంత్రం సెషన్ 5:00 గంటలకు ప్రారంభమై రాత్రి 11:30/11:55 వరకు కొనసాగుతుంది.
ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి. మహావీర్ జయంతితో పాటు, ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ