సూరత్లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం
సూరత్, 31 మార్చి (హి.స.) మూడంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం (Massive fire Accident) చోటు చేసుకొని చిన్నారి సహా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లోని సూరత్ నగరం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక మూడంతస్
ఫైర్ ఆక్సిడెంట్


సూరత్, 31 మార్చి (హి.స.)

మూడంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం

(Massive fire Accident) చోటు చేసుకొని చిన్నారి సహా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లోని సూరత్ నగరం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక మూడంతస్తుల భవనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఒక నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. ఆ కుటుంబం ఇంట్లోనే చీరల ప్యాకింగ్ పనులను నిర్వహిస్తోందని, ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande