బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్..
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం, మల్టిపుల్ గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ (Leander Paes) తన రాజకీయ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ
Leander face


న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.)

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ

కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం, మల్టిపుల్ గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ (Leander Paes) తన రాజకీయ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా టెన్నిస్ కోర్టులో దేశం తరఫున ఆడానని, ఇప్పుడు రాజకీయాల ద్వారా దేశానికి, ముఖ్యంగా యువతకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని 'ఖేలో ఇండియా' ఉద్యమం అద్భుతమైన పథకమని, అది క్రీడాకారులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన కొనియాడారు. అలాగే పశ్చిమ బెంగాల్తో తనకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు పేస్ వెల్లడించారు.

దేశం తనపై ఉంచిన ఈ పెద్ద బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలకు జోరుగా ప్రచారం సాగుతున్న క్రమంలో లియాండర్ పేస్ ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో బీజేపీలో చేరడం బెంగాల్ బీజేపీకి పెద్ద బూస్ట్ అని సుకాంత మజుందార్, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్ను ఆకర్షించాయని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే క్రీడారంగంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న పేస్, ఇప్పుడు రాజకీయ రంగంలో ఏ విధంగా రాణిస్తారో చూడాలని క్రీడా, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande