
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.)
భారతదేశంలో అతి పెద్ద ఎయిర్
లైన్ సంస్థ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా విలయం వాల్ష్ నియమితలయ్యారు. బ్రిటీషన్ ఎయిర్ వేస్ మాజీ చీఫ్ గా పని చేసిన విలయం వాల్ష్ తమ తదుపరి సీఈవోగా నియమించుకుంది. ఈయన ప్రస్తుతతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (IATA) డైరెక్టర్ జనరల్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇండిగో తాత్కాలిక సీఈవోగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు నిర్వర్తించగా అంతకు ముందు ఈ పదవిలో పీటర్ ఎల్బర్స్ కొనసాగారు.
పీటర్ ఎల్బర్స్ సారథ్యంలో ఇండియా వరుస వైఫల్యాలతో అప్రతిష్టను తీవ్ర మూటగట్టుకుంది.గతేడాది ఈ పీటర్ ఎల్బర్స్ నేతృత్వంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెట్టింది. వందలాది ఫ్లైట్లు రద్దు చేసి ప్రత్యక్ష నరకం చూపింది. ఈ పరిణామంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విచారణ జరుపుతూ, చర్యలకు ఉపక్రించింది. నేపథ్యంలో ఆయన ఇండిగో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఎల్బర్స్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ, తన నోటీసు కాలాన్ని మినహాయించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..