దుర్గగుడి హుండీ. ఆదాయం లెక్కింపులో.నిర్లక్యం
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.), : దుర్గగుడి హుండీ ఆదాయం లెక్కింపులో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కానుకల్లోని 10 గ్రాముల బంగారు వస్తువులు చెత్తబుట్టలో పడ్డాయి. వీటిని గుర్తించిన పాలకమండలి సభ్యులు ఈవోకు ఫిర్యాదు చేయడంతో బాధ్యులపై వేటుపడింది. దుర్గగుడి హుండ
దుర్గగుడి హుండీ. ఆదాయం లెక్కింపులో.నిర్లక్యం


అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.), : దుర్గగుడి హుండీ ఆదాయం లెక్కింపులో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కానుకల్లోని 10 గ్రాముల బంగారు వస్తువులు చెత్తబుట్టలో పడ్డాయి. వీటిని గుర్తించిన పాలకమండలి సభ్యులు ఈవోకు ఫిర్యాదు చేయడంతో బాధ్యులపై వేటుపడింది. దుర్గగుడి హుండీలోపడ్డ కానుకలు గత నెల 30న లెక్కించారు. ఎప్పటిలాగే సోమవారం కూడా ఆ కానుకల్లో గోల్డు, రోల్డు గోల్డు వస్తువులను దేవస్థానంలోని అప్రైజర్ వేరు చేశారు. రోల్డు గోల్డు వస్తువులను డస్ట్లో వేశారు. ట్రస్టు బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, రాఘవరాజు చెత్తబుట్టలో వేసిన వస్తువులను పరీక్షించారు. వాటిలో 10 గ్రాముల వస్తువులు బంగారంతో చేసినవని గుర్తించారు. గుడి నుంచి బంగారు వస్తువులు బయటికి వెళ్తున్నాయనే ఫిర్యాదులపై శ్రీనివాసరావు, రాఘవరాజు కొంతకాలంగా నిఘా నిఘాపెట్టారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోల్డు అప్రైజర్ షమ్మీని సస్పెండ్ చేసినట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ముడుపులు, మొక్కుబడులు వేరు చేసేటప్పుడు అప్రైజర్ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఇటువంటి ప్రచారాలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. తొలుత అప్రైజర్ వేరు చేసిన వాటిని బ్యాంకు అప్రైజర్, ఎస్పీఎఫ్, దేవస్థానం అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పరీక్షించిన తర్వాతే చెత్తబుట్టను తగలబెట్టేందుకు తరలిస్తారని చెప్పారు. అప్రైజర్పై వచ్చిన ఫిర్యాదులు, నిర్లక్ష్యంపై విచారణకు గతంలో కమిటీని వేశామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande