
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.) రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్నుపై పురపాలకశాఖలో కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఫోకస్ పెట్టింది. దీంతో గత ఏడాది కంటే ఈసారి రూ.68 కోట్లు ఎక్కువగా వసూలైంది. 2024-25 లో డిమాండ్ రూ.1,011కోట్లకుగాను 5.617 కోట్లు . 2025-26 లో రూ.1,179 కోట్లకుగాను రూ.685 కోట్లు వచ్చింది. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో 100శాతం వసూలైంది.
గతేడాది కంటే ఈసారి 64 యూఎల్బీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. . 90 మున్సిపాలిటీల్లో 50 శాతానికి కంటే ఎక్కువగా వసూలైందని, కొత్తగా ఏర్పడిన 21 మున్సిపాలిటీలకు గాను 16 మున్సిపాలిటీల్లో గతం కంటే ప్రాపర్టీ కలెక్షన్ పెరిగిందని వెల్లడించారు.
రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే సీడీఎంఏ పరిధిలో 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీలతో కలిపి రూ.1057 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే టార్గెట్ రూ.1500 కోట్లు పెట్టుకుంటే రూ.1057 వసూలు చేశారు. ఈసారి 133యూఎల్బీల్లో రూ.1,179 కోట్ల డిమాండ్ ఉంటే రూ.685కోట్లు వసూలైంది. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27 యూఎల్బీల్లో సుమారు రూ.500కోట్ల ట్యాక్స్ వసూలైంది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ స్కీమ్పై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో వెనుకబడినవారంతా ఎర్లీబర్డ్ను వినియోగించాలని కమిషనర్ టీకే. శ్రీదేవి సూచించినట్లు తెలిసింది. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వసూలు చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..