
కనిగిరి, 01 ఏప్రిల్ (హి.స.)ప్రతి పేద కుటుంబానికి స్వంతంగా ఇల్లు కల్పించటమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మున్సిపాల్టీ 7వ వార్డు పరిధిలోని చాకిరాల వద్ద పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు ఉండాలనేది ఆకాంక్షగా ఉంటుందన్నారు. దాన్ని నెరవేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నందు వలన పేదవాడికి స్వంత ఇల్లు కలగానే మిగిలిపోతుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.5లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో పీఎంఏవై పథకం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో బృహత్తర కార్యక్రమాన్ని కార్యరూపం ఇచ్చి విజయవంతంగా అమలు చేసిందన్నారు. రానున్న మూడేళ్లలో కనిగిరి ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు నిర్మించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గృహ యజమానులు మునగాల హైమావతి, మాల్యాద్రిల దంపతులకు గృహ నమూనాను అందచేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ కోటిరెడ్డి, ఏఈ ముసలయ్య, మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్ పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. స్థానిక 16వ వార్డులోని భగత్సింగ్ కాలనీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ పీఎంఏవై పథకం పేదలకు వరంలాంటిదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద 2.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. మార్కాపురం జిల్లాలో త్వరితగతిన ఎక్కువ గృహాలు నిర్మించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకం కింద నియోజకవర్గంలో 3,241 గృహాలను పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.3లక్షలు ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభు త్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.ప్రభాకర్, హౌసింగ్ పీడీ మోహన్రావు, డీఈ పవన్కుమార్, మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, ఏఎమ్సీ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, కౌన్సిలర్ దారివేముల హర్షితబాబీ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్