మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ.. సిద్ధమైన సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ
సంగారెడ్డి, 01 ఏప్రిల్ (హి.స.) రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. జిల్లాలోని 26 మండలాల పరిధిలో 855 రేషన్ షాప్ లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,42,746 కార్డులకు గాను 14,93, 876 మంద
Civil supply


సంగారెడ్డి, 01 ఏప్రిల్ (హి.స.)

రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది.

జిల్లాలోని 26 మండలాల పరిధిలో 855 రేషన్ షాప్ లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,42,746 కార్డులకు గాను 14,93, 876 మంది లబ్దిదారులు నమోదై ఉన్నారు. వీరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా 89,63,256 నెలకు కేజీలు, మూడు నెలలకు కలిపి 2,68,89,768 కేజీల బియ్యం అవసరమవుతాయని అధికారులు తెలిపారు. బియ్యం పంపిణీ సజావుగా సాగేలా ఇప్పటికే పౌరసరఫరాల శాఖాధికారి బాల సరోజ సమీక్షిస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి షాప్లకు రవాణా, లబ్ధిదారులకు పంపిణీపై సూచనలు చేశారు.

గత వర్షాకాలంలో కూడా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. అప్పట్లో 1 నుంచి 15వ తేదీ వరకే గడువు విధించగా, సర్వర్ సమస్యతో లబ్దిదారులు గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి రావడంతో గడువు పొడిగిస్తూ వెళ్లారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కావొద్దని ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులందరికీ బియ్యం అందేలా నెల మొత్తం షాపులు తెరిచి ఉంచాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే షాపుల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా బియ్యం సరఫరా చేశారు. డీలర్లు నిబంధనలు పాటించేలా నిరంతరం పర్యవేక్షించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande