జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ దే.. కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.) లోక్ సభలో ప్రవేశపెట్టి అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించ
కిషన్ రెడ్డి


న్యూఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)

లోక్ సభలో ప్రవేశపెట్టి అమరావతి

చట్టబద్ధత బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. 1969లో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న 369 మందిని తుపాకులతో కాల్చి చంపిందని విమర్శించారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. చివరి దశలో కూడా 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు ఏడు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎయిర్ పోర్టు మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రాల విభజన తర్వాత ఏపీ ప్రజలు తమ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి రావడం బాధాకరమన్నారు. విభజన తర్వాత రెండురాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి కావలసి ఉన్నా.. సమన్వయ లోపాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ బీజేపీ తరపున అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కాగా... తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారిని కాంగ్రెస్ కాల్చి చంపిందనడంతో... కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande