
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.
శ్రీరామ పరమభక్తుడైన హనుమంతుడు అపార బలానికి, జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీక అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్వీట్ లో హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక అని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప గుణానికి ఆంజనేయుడే నిదర్శనమని కొనియాడారు. ప్రజలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుని, పవనపుత్రుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని లోకేశ్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV